ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

అతనికి నేను నాజూకు కనిపించలేదేమో.....అర్చన

Posted 23 days ago movies

హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించినా రాని గుర్తింపుని బిగ్‌బాస్ సీజన్ వన్‌తో సంపాదించుకుంది అర్చన అలియాస్ వేద. తాజాగా ఆమె ఓ వెబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అర్చన అందం గురించి ఓ తమిళ డైరెక్టర్ చేసిన కామెంట్‌పై ఆమె తనదైన తరహాలో సమాధానం ఇచ్చారు. అర్చనకి అందం ఎక్కువే కానీ ఆమెలో నాజూకుతనం లేదు అని తమిళ డైరెక్టర్ చేసిన కామెంట్ గురించి మీరేం చెబుతారు? అనే ప్రశ్నకి అర్చన అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

‘‘నిజమా.. ఈ విషయం నాకు ఇంత వరకు తెలియదు. ఎవ్వరూ ఇంతవరకు నాతో కూడా అనలేదు. హీరోయిన్‌ల గురించి డైరెక్టర్స్ ఇటువంటి కామెంట్స్ చేయడం సహజమే. అయితే సక్సెస్ ఉన్నప్పుడు ఇటువంటి వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇటువంటి మాటలు కూడా ఎవ్వరూ మాట్లాడరు. నిజంగా ఆ డైరెక్టర్ అలా అని ఉంటే మాత్రం, నిజంగానే నాలో అతనికి కావాల్సిన నాజూకు కనిపించలేదేమో? అయినా ఇలాంటి వాటిని నేనే కాదు, స్టార్ హీరోయిన్స్ కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వారితో పోల్చుకుంటే నేనేంత?.

నేను ఇప్పటి వరకు సినిమాలు చేస్తున్నాను అంటే నాలో ఏదో విషయం ఉందనే కదా! అందుకే ఇంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా. నాపై నాకు నమ్మకం ఉంది. ఏదైనా పాత్ర నేను చేయాలి అని రాసిపెట్టి ఉంటే, ఎంతమంది అడ్డుపడినా అది నా దగ్గరకే వస్తుంది. అలాంటి నమ్మకంతోనే ఉంటాను కానీ, అవకాశాలు లేవని, నాజూగ్గాలేననే మాటలకి మాత్రం పడిపోను..’’ అంటూ అర్చన ఈ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు.

Most Read