//single page style gallary page

పజిల్ పూర్తి చేస్తే? 64 లక్షల బహుమతా!

Posted a year ago | Category : world kids

ఎన్నో వింత వింత మ్యూజియాల గురించి వినే ఉంటారు.ఆడుకొనే పజిళ్లకు ఒక మ్యూజియం ఉంది అంటే మీరు నమ్ముతారా ! నమ్మాలి మరి మంగోలియా దేశంలోని ఉలాన్ బాటర్ లో 'ఇంటర్నేషనల్ ఇంటిలెక్చవల్ అండ్ పజిల్' పేరుతో ఒక మ్యూజియం ఉందట. ఈ మ్యూజియంలో రూబిక్స్ క్యూబ్, చదరంగపు బోర్డులు, వింత వింత పజిల్, బొమ్మలు, రకరకాల ఆటలు మొత్తం ఐదు వేలకు పైనే ఉంటాయంట, ఈ మ్యూజియంలో ఒక ప్రత్యేకమైన పజిల్ కూడా ఉంది దానిని పూర్తి చేయాలంటే దాదాపు 56,831 సార్లు కదిలించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియంలో మీ తెలివితేటలను పరీక్షించుకుంటూ ఎంచక్కా పజిళ్లను పూర్తి చేస్తూ ఆడుకోవచ్చు. మీకు సమాధానం తెలిస్తే మంచి మంచి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.

ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ఉన్న తాబేలు పజిల్ ను పూర్తి చేస్తే లక్ష డాలర్లను గెలుచుకోవచ్చు అంటే మన ఇండియన్ రూపాయల్లో 64 లక్షలు అన్నమాట అయితే ఈ పజిల్ ను నిర్ణిత గడువులో పూర్తీ చేస్తేనే విజయం, అప్పుడే ఆ బహుమతి మీ సొంతం అవుతుంది. మూడు దశాబ్దాలుగా ఎంతో మంది ప్రయత్నిస్తున్న ఇప్పటి వరకు ఎవరు విజయం సాధించలేక పోయారట. మిగతా పజిల్ విషయానికి వస్తే మనకు సమాధానం తెలియకపోతే చిటికలో చెప్పే నిపుణులు కూడా అక్కడ ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే మనం ఇప్పటి వరకు ప్లాస్టిక్ తో చేసిన పజిల్ ను మాత్రమే చూసి ఉంటాం, కానీ ఇక్కడ బంగారం, వెండి, విలువైన రాళ్లతో తయారు చేసిన పజిల్ ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని టూమెన్ ఉల్జీ అనే పశువుల కాపరి కొడుకు ప్రారంభించాడు, ఈయనకి చిన్నపుడు పజిల్ అంటే ఇష్టం ఉండేది కాదు అయితే ఒక రోజు ఆరు బ్లాకులను కలిపే పజిల్ ఒకటి వాళ్ళ నాన్న అతనికి ఇచ్చాడు అందులో ఒక బ్లాకు ఉండదు, అయితే చాలా శ్రమించి దానికి సమాధానం కనిపెట్టాడు టూమెన్ ఉల్జీ. దాంతో అతడికి పజిళ్ల ఫై ఆసక్తి పెరిగింది. తానే సొంతంగా పజిల్స్ తయారు చేయటం మొదలు పెట్టాడు కొన్ని రోజులకు మంగోలియా దేశ యువత కోసం సృజనాత్మక పజిల్స్ తయారు చేయటం కోసం ఒక కంపెనీని సొంతంగా ప్రారంభించాడు. అలా తయారు చేసిన పజిళ్లని ఒక చోట ఉంచితే బాగుంటుందని ఆలోచనతో ఈ మ్యూజియాన్ని ప్రారంబించాడంటా.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted a month ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం