బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన 91 ఏళ్ల భామ్మ

Posted 5 months ago | Category : world

ఇంట్లో ఏ బాధ్యత లేకుండా ఖాళీగా కూర్చోవడానికే శరీరం సహకరించని వయస్సులో చదువుపై ఎవరికైనా ధ్యాస వుంటుందా ? అదీ 91 ఏళ్ల వయస్సులో బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలనే కోరిక, ఏకాగ్రత వుంటాయా ? కానీ పట్టుదల వుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది థాయిలాండ్‌కి చెందిన కిమ్లన్ జినకుల్ అనే భామ్మ. దాదాపు 80 ఏళ్లు దగ్గరపడే వయస్సులో ఆమెకి బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓపెన్ యూనివర్శిటీలో చేరి హ్యూమన్ అండ్ ఫ్యామిలీ డెవలప్‌మెంట్ అనే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకుంది.

ఎలాగైనా ఈ డిగ్రీ పట్టాను చేజిక్కించుకోవాలని గట్టిగానే నిర్ణయించుకున్న ఈ భామ్మ దాదాపు పదేళ్లకిపైగానే కష్టపడి మరీ విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. గతేడాదే థాయిలాండ్ రాజ సింహాసనాన్ని చేజిక్కించుకున్న రాజు మహావజిరలాంగ్‌కర్న్ చేతులమీదుగా బుధవారమే ఈ డిగ్రీ పట్టా అందుకుందీ ఈ భామ్మ. యుక్త వయస్సులోనూ చదువుపై ఏకాగ్రత చూపించలేని వాళ్లెందరికో ఆదర్శంగా నిలిచింది కదా ఈ భామ్మ. అంతేకాకుండా వృద్ధాప్యం రాగానే ఇక మనం ఏమీ చేయలేం అని దిగులు పడాల్సిన పనిలేదు... మనిషి తల్చుకుంటే ఏమైనా సాధించొచ్చు అని మరోసారి థాయిలాండ్‌ భామ్మా నిరూపించింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!