ఏడేళ్లకే 8 ప్యాక్స్ బాడీ.

Posted 7 months ago | Category : world

వయసు ఏడేళ్లు..బాడీ మాత్రం 8 ప్యాక్ బాడీ.. అందుకే ఈ బుడతడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. ఏడేళ్ల వయసులో ఈ బుడతడు 8 ప్యాక్ ఎలా సాధించాడని జుట్టు పీక్కుంటున్నారు. చైనాకు చెందిన ఏడున్నరేళ్ల 'చెన్ యి' అత్యంత ప్రతిభ కలిగిన జిమ్నాస్ట్. ఈ బాలుడికి తూర్పు చైనాలోని ఝీజియాంగ్ ప్రావిన్స్‌లో రెండేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగానే చెన్ 8 ప్యాక్ బాడీని డెవలప్ చేశాడు.

జులై 2న ఝీజియాంగ్ రాజధాని హాంగ్‌ఝౌ‌లో జరిగిన 19వ హాంగ్‌ఝౌ సిటీ స్పోర్ట్స్ గేమ్స్‌లో చెన్ పాల్గొన్నారు. మొత్తం 50 మంది చిన్నారులు పాల్గొన్న ఈ పోటీల్లో చెన్ ఆరు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించాడు. పోటీలు ముగిశాక బట్టలు మార్చుకునే సమయంలో ఒకరు చెన్ ఫొటోలు తీశారు. చెన్ కూడా కండలు బిగించి మరీ ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో పెట్టడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

చెన్ గురించి తన తల్లి ఝాంగ్ హోంగ్యూ మాట్లాడుతూ ‘పుట్టుకతోనే నా కొడుకు బలవంతుడు. సుమారు తొమ్మిది పౌండ్ల బరువుతో పుట్టాడు. 11 నెలలకే నడవడం మొదలుపెట్టాడు. రెండేళ్ల వయసులో ఒకచేతితో పాల బాటిల్ పట్టుకుని తాగుతూ, మరో చేతితో అడ్డంగా ఉన్న బార్‌ను పట్టుకుని వేలాడేవాడు’ అని చెప్పి మురిసిపోయింది. ఐదేళ్ల వయసుకే చెన్ జిమ్నాస్టిక్ స్కూల్‌కి ఎంపికయ్యాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూల్‌లో ఉండి శిక్షణ తీసుకుంటూ వారాంతంలో ఇంటికెళ్లి తల్లిదండ్రులతో గడుపుతాడు. ఇంత కఠినమైన శిక్షణ ఇస్తున్నారు కాబట్టే చైనీయులు జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయంగా అన్ని పతకాలు సాధిస్తున్నారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!