ఈజిప్ట్ లో రెండు రైళ్లు ఢీ: 44 మంది మృతి

Posted 6 months ago | Category : world

ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది.

స్థానిక కెనాల్‌ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్‌ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్‌ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 44 మంది మృతిచెందారు. మరో 180 మంది వరకూ గాయపడ్డారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సమాచారమందుకున్న రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బోగీల శిథిలాలను తొలగిస్తూ ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంతో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న రైలు డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌-సిసి విచారం వ్యక్తం చేశారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!