ముడేళ్ళల్లో లోక్ సభకు సరిగ్గా హాజరు కాని 30 మంది యంపీలు

Posted 9 months ago | Category : national politics

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్ల పూర్తవుతోంది. ఈ మూడేళ్ళకాలంలో మొత్తంగా 13 సార్లు పార్లమెంట్‌  సమావేశాలు జరిగాయి. దాదాపు 30 మంది సభ్యులు లోక్‌సభకు 50 శాతం కంటే తక్కువసార్లు హాజరయ్యారు. అందులో తృణముల్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు చెందిన సభ్యులే అధికంగా ఉన్నారు. 

తృణముల్‌ నుంచి ఏడుగురు, బిజెపి నుంచి నలుగురు, కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)ల నుంచి చెరో ముగ్గురు, బిజూ జనతా దళ్‌(బిజెడి), జార్ఖండ్‌ ముక్తి మోర్చ్‌ (జెఎంఎం), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపి), పట్టలి మక్కల్‌ కట్చి (పిఎంకె), సమాజ్‌ వాదీ పార్టీ (ఎప్సీ)ల నుంచి ఒక్కొక్కరు పార్లమెంట్‌కు డుమ్మా కొట్టిన వారిలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు సభ్యులు సభకు డుమ్మాకొట్టిన జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు సభ్యులు- తెలుగు దేశం పార్టీ(టిడిపి) నుంచి ముగ్గురు , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి ఒకరు- ఈ జాబితాలో ఉన్నారు. 

టిడిపి చెందిన ఎన్‌.శివప్రసాద్‌ (37శాతం), రాయపాటి సాంబశివరావు (41శాతం), వైసిపి తరపు గెలిచి టిడిపిలో చేరిన ఎస్పీవై రెడ్డి (15శాతం), వైసిపికి ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి (38శాతం) తక్కువ సార్లు హాజరైన వారిలో ఉన్నారు. 

పార్లమెంట్‌ చర్చల్లో పాల్గొనని సభ్యుల్లో కూడా బిజెపి, టిఎంసి సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు.  మొత్తం లోక్‌సభ వ్యవహారాల్లో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిలో బిజెపి, టిఎంసి పార్టీల సభ్యులు ఐదుగురు చొప్పునవున్నారు. బిజెడి, జెఎంఎం, ఎన్సీపి నుంచి ఒక్కొక్కరున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎస్పీవై రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారు. 

టిడిపి, టిఎంసి, ఆప్‌, ఎస్పీల పనితీరు సగటు కంటే తక్కువ సమర్ధవంతంగా ఉంది. . సభ్యుల హాజరులో 83 శాతంతో సిపిఎం ముందడుగులో ఉంది. 59 శాతంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అత్యల్పంగా నిలిచింది. టిడిపి (79శాతం), వైసిపి (65శాతం), టిఆర్‌ఎస్‌ (68శాతం)లు అంతకన్నా కొంత మెరుగైన హాజరు నమోదుచేశాయి. 


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!