జైలులో ఖైదీల మధ్య గొడవ...28 మంది దారుణ హత్య.

Posted 7 months ago | Category : world

మెక్సికోలోని ఓ జైలులో హింస చెలరేగింది. ఈ ఘటనలో 28 మంది హత్యకు గురి కాగా ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. గుయెర్రెరో రాష్ట్రం లాస్ క్రూసెస్ ఫెడరల్ జైలులో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఖైదీల మధ్య గ్రూపు గొడవల నేపథ్యంలోనే ఈ హత్యాకాండ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఖైదీల ముఠాల మధ్య ఆధిపత్య పోరులోనే ఈ దారుణ హత్యలు జరిగి ఉంటాయని జైలు అధికారులు భావిస్తున్నారు. ఖైదీల మృతదేహాలు కిచెన్ - సెక్యూరిటి వింగ్ - విజిటింగ్ ఏరియాలో పడి ఉన్నాయని తెలిపారు.ఒక వర్గం వారు ప్రత్యర్థి వర‍్గం వారిని తీవ్రంగా కొట్టి చంపారని కొందరి గొంతులు కోసి ఉండగా మరికొందరి శరీరాలపై బుల్లెట్ గాయాలున్నాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.

కాగా జైలులో ఉన్న తమ వారి వివరాలను క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు ఖైదీల బంధువులు జైలు వద్దకు వచ్చారు. మెక్సికోలోని జైళ్లలో అధిక శాతం ఖైదీల ఆధిపత్యమే నడుస్తుంటుంది. అక్కడ జైళ్లలోకి మద్యం - మాదకద్రవ్యాలు - ఆయుధాల రవాణా యథేచ్ఛగా జరుగుతుంటుంది. జైళ్లలో ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం ఖైదీల ముఠాలు గొడవలకు దిగుతుంటాయి. 2016లో టోపోచికో జైలులో ఖైదీల మధ్య జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసులతో పాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. జైలుపై రెండు హెలికాప్టర్లు ఎల్లప్పుడూ పహారాకు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఈ ఘటనపై గుయెర్రెరో రాష్ట్ర గవర్నర్ విచారణకు ఆదేశించారు. మెక్సికోలోని జైళ్లు ఎల్లపుడూ ఖైదీలతో కి్క్కిరిసి ఉంటాయి. అక్కడి జైళ్లలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. జైళ్ల అధికారులు లంచాలకు అలవాటు పడి అక్కడి ఖైదీలకు డ్రగ్స్ - ఆయుధాలు సప్లై చేస్తుంటారు. నేరాలు చేసి జైలుకు వెళ్లిన ఈ ఖైదీలు హింసను మాత్రం ఆపలేదు...దానికి తోడు అక్కడ జైలు అధికారులే లంచాలు తీసుకుని వారికి ఆయుధాలు అందిచటం ఏ మాత్రం సహించలేని విసయమనే చెప్పవచ్చు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!