హోస్టన్ వరదల్లో 200 మంది భారతీయ విద్యార్థులు

Posted 6 months ago | Category : world

రెండు వందల మంది భారత విద్యార్థులు అమెరికాలోని హోస్టన్ వరదల్లో చిక్కుకున్నారని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్  ట్విట్టర్‌లో తెలిపారు. హోస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ అనుపమరాయ్‌తో తాను మాట్లాడానని పేర్కొన్నారు. యూనివర్సిటీ పరిసరాల్లో మోకాలు లోతులో నీరు నిలిచి ఉందని, భారత్ నుంచి ఆహారం, ఇతర సామగ్రిని పంపించేందుకు ప్రయత్నించినా యూఎస్ కోస్ట్‌గార్డులు అనుమతించడంలేదని సుష్మ తెలిపారు.

సహాయ, పునరావాస చర్యల నిమిత్తం నాలుగు వేల దళాలను టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబాట్ పంపించారని ఆమె పేర్కొన్నారు. ఇద్దరు భారత విద్యార్థులు షాలిని, నిఖిల్ భాటియాలను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారని, వారి బంధువులను వీలైనంత తొందరగా అక్కడికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మా చెప్పారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హార్వే హరికేన్ ధాటికి అతలాకుతలం అయ్యింది. గత యాబై ఏండ్లలో టెక్సాస్‌ను తాకిన అతి తీవ్రమైన తుఫాను ఇదేనని యూఎస్ అధికారులు చెప్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఏండ్లలో కురవాల్సిన వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు. హరికేన్ హార్వే శుక్రవారం టెక్సాస్ తీరాన్ని తాకింది. అనధికారిక సమాచారం ప్రకారం అయిదుగురు వ్యక్తులు మృతి చెందగా, 14మంది గాయపడ్డారు.

హోస్టన్‌తోపాటు టెక్సాస్‌లోని మిగతా ప్రాంతాల్లోని వీధులు, ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. కోటి ముప్పై లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి లోనయ్యారు. సుమారు మూడు లక్షల మంది అంధకారంలో ఉన్నారు. ఒక్క రోజులో అత్యధికంగా 50.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. వరద ప్రభావం మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. మంగళవారం తాను టెక్సాస్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!