ఎయిర్ ఇండియాలో 15 వేల వీఆర్‌ఎస్

Posted 7 months ago | Category : business

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దాదాపు 15 వేల మంది సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) ఆఫర్ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థలో 40వేల మంది పనిచేస్తున్నారు. సంస్థ ప్రైవేటీకరణకు గతనెలలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అందులో మూడోవంతుకు పైగా ఉద్యోగులను వీఆర్‌ఎస్ ద్వారా వదిలించుకోవాలని ఎయిర్‌ఇండియా యోచిస్తున్నది. 

అంతేకాదు, విమానాల విస్తరణ ప్రణాళికను సైతం పక్కకు పెట్టినట్లుగా సమాచారం. అయితే, సంస్థకు అలాంటి ఆలోచనేం లేదని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వనీ లొహానీ అన్నారు. సంస్థ ప్రైవేటీకరణ ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని లేఖ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. 

అంతేకాదు, యాజమాన్య మార్పుతో సంస్థలో కార్పొరేట్ సంస్కృతి పెరుగుతుందని, ప్రతిభ గల వారికి తగిన ప్రోత్సాహం, ప్రతిఫలం లభిస్తుందన్నారు. అయితే, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న సంస్థ కార్యాలయం ముందు 300 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులు నిరసన ప్రదర్శించారు. 

ఎయిర్‌ ఇండియాలో పూర్తి లేదా పాక్షిక వాటాను విక్రయించాలని మోదీ సర్కారు భావిస్తున్నది. సంస్థ కొనుగోలుకు టాటాసన్స్, ఇండిగోలు ఆసక్తిగా ఉన్నాయి. రూ.52 వేల కోట్ల మేర అప్పుల భారంతో సంక్షోభంలోకి జారుకున్న ఈ సంస్థను పునరుద్ధరించేందుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ కింద ఇప్పటివరకు రూ.23 వేల కోట్ల మేర నిధులు సమకూర్చింది. అయినప్పటికీ సంస్థ కోలుకోవడం సాధ్యంకాదని, ప్రైవేటీకరించడమే మేలని నీతి ఆయోగ్ కేంద్రానికి నివేదిక సమర్పించింది. 


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 10 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 11 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 12 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 12 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 14 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 14 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 18 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 19 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 19 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 19 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 19 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!