ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

బీజేపీపై ఉమ్మడి పోరుకు శరద్ చొరవతో 12 పక్షాలు సిద్ధం

Posted 4 months ago politics

జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్ ఢిల్లీలో నిర్వహించిన సాంఝీ విరాసత్ బచావో సదస్సులు పాల్గొన్న 12కు పైగా గల పార్టీల నాయకులు బీజేపీకి పై ఉమ్మడి పోరు జరపాలని నిర్ణయించారు. సమ్మిళిత సంస్కృతిని కాపాడేందుకు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎన్సీ, జేడీ(యూ), జేడీ(ఎస్), ఆర్‌ఎల్‌డీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వచ్ఛ్‌భారత్ సృష్టిస్తానని మోదీ చెప్తున్నారు. మేమంతా సచ్ భారత్ (నిజాల భారత్)ను కోరుకుంటున్నాం అని చెప్పారు.

మోదీ ఎక్కడికెళ్లినా అబద్ధాలే చెప్తున్నారని, ప్రజలు నిజాలు కోరుకుంటున్నారని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ విమర్శించారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, యువతకు ఉద్యోగాలిస్తామని చెప్పి మాట తప్పారని రాహుల్ పేర్కొన్నారు.

"మనం కలిసికట్టుగా పోరాడితే.. వారు ఎక్కడా మిగులరు" అని రాహుల్ వ్యాఖ్యానించారు. నేరుగా ఎన్నికల్లో గెలువలేమని ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలుసు. అందువల్లే ప్రతీ సంస్థలో, ప్రతీ విభాగంలో తన మనుషుల్ని చొప్పిస్తున్నది అని రాహుల్ ఆరోపించారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ అన్నివర్గాలు, హిందూ ముస్లింలు ఏకమై బ్రిటిష్‌వారిని కూడా తరిమివేయగలిగాయని, కానీ ప్రస్తుతం ఆ సమ్మిళిత సంస్కృతే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విభజన సందర్భంగా అత్యధిక ముస్లింలు ఇక్కడే ఉండిపోయారని, అలాంటి భిన్నసంస్కృతిని దెబ్బతీస్తూ ఇప్పుడు దేశాన్ని హిందూరాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.

ఇక జేడీ(యూ) తిరుగుబాటు నేత, బీజేపీతో పార్టీ జతకట్టడాన్ని వ్యతిరేకించిన శరద్‌యాదవ్ మాట్లాడుతూ మనందరం ఏకమైతే హిట్లర్ లాంటోడు కూడా మట్టికరువక తప్పదు అని స్పష్టం చేసారు. శరద్‌యాదవ్‌దే నిజమైన జేడీ(యూ) అని, మంత్రిపదవిని తిరస్కరించి సెక్యులర్ మార్గాన్ని ఎంచుకున్నారని రాజ్యసభ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసించారు. రాష్ర్టాల వ్యవహారాల్లోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా జోక్యం చేసుకుంటున్నదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా విమర్శించారు.

Related Articles

Most Read