//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెల్మెట్ పెట్టుకుని బౌలింగ్ వేసి రికార్డు సృష్టించిన వారెన్ బార్నెస్..!

Category : sports

క్రికెట్‌లో హెల్మెట్ ఎప్పుడు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకుంటారు? ఇదేం ప్రశ్న.. చిన్న పిల్లాడిని అడిగినా దీనికి సమాధానం చెబుతాడు.. బ్యాట్స్‌మెన్, కీపర్, అప్పుడప్పుడు స్లిప్‌లో ఫీల్డింగ్ చేసేవారు హెల్మెట్ పెట్టుకుంటారు. ఇంత చిన్న విషయం కూడా తెలియదా? అనుకోకండి.. ఎందుకంటే, న్యూజిలాండ్ బౌలర్ వారెన్ బార్నెస్ హెల్మెట్ పెట్టుకుని బౌలింగ్ వేసి రికార్డు సృష్టించాడు. హమిల్టన్ వేదికగా ఒటాగో-నార్త్‌రన్ నైట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతుండడంతో బార్నెస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒటాగో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి నార్తరన్ నైట్స్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ కాలుకు బలంగా వచ్చి తాకింది. దీంతో భయపడిపోయిన వారెన్ తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాడు. బౌలింగ్ చేసేటప్పుడు తన తల నేరుగా బ్యాట్స్‌మన్ వైపు ఉంటుందని భావించిన బార్నెస్ బేస్‌బాల్ క్రీడలో అంపైర్ ధరించే హెల్మెట్ ధరించి మరీ బౌలింగ్ వేశాడు. ఇలా మొత్తం మూడు ఓవర్లు వేశాడు. మ్యాచ్ అనంతరం బార్నెస్ మాట్లాడుతూ బౌలింగ్ వేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని తీసుకున్న నిర్ణయం సరైందేనన్నాడు.

నిజానికి క్రికెట్ మొదలైన చాలా దశాబ్దాల తర్వాత ఆటలోకి హెల్మెట్లు ప్రవేశించాయి. 1970 దశకంలో వీటిని వాడడం మొదలుపెట్టారు. తొలుత వీటిని పెట్టుకుని ఆడేందుకు ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా వీటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు వీటి వాడకం విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు బ్యాట్స్‌మెన్, కీపర్, ఫీల్డర్లు వాడుతుండగా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ వారెన్ బార్నెస్ వాడడం తొలిసారి వాడాడు. ఇకపై ఈ ట్రెండ్‌ను ఇంకెంతమంది ఫాలో అవుతారో వేచి చూడాల్సిందే..!

Related News