//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మందేసి పోలిసుల ముందు నుండి వెళ్ళినా ఏమీ చేయలేని పోలీసులు ! అసలేమైందంటే ?

Category : editorial

పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లో తప్పించుకునేందుకు మందు బాబులు అనేక దారులు వెతుక్కుంటున్నారు.

గతంలో వాలెట్ డ్రైవర్లను వాడిన మందుబాబులు, ఇప్పుడు మరో అదిరిపోయే ప్లాన్ వేశారు. మందుబాబులు అమలు చేసిన ఈ ప్లాన్ తో వారిని ఎలా బుక్ చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్న పరిస్థితి. అసలింతకీ ఏం జరిగిందంటే... దగ్గర్లో బార్ ఉందో ఏమో... చుక్కేసి బైకులెక్కిన వారికి, మూల మలుపులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ కనిపించారు.

ఇంకేముందు ప్రతి ఒక్కరూ చక్కగా బండి దిగేసి, వాటిని నెట్టుకుంటూ పోలీసుల ముందు నుంచి వెళ్లిపోయారు. వాళ్లు మందేశారని తెలిసినా, బండిని నడుపుకుంటూ వెళుతున్నారు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఒకరు, ఇద్దరూ కాదు... వందల మంది ఇలా బండి నడిపించుకుంటూ వెళ్లిపోయారు.

ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదుగానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని బుక్ చేయాలంటే మద్యం తాగి, బండిని నడిపించుకుని కూడా వెళ్లకూడదన్న చట్టం తేవాలేమో?