//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెల్ఫీ వీడియోలో కొత్త ట్విస్ట్ !

Category : editorial

నిన్నా, మొన్నా ఒక వార్త తెగ హల్ చల్ చేసింది. శివ అనే యువకుడు హైదరాబాద్ భరత్ నగర్ రైల్వే ట్రాక్ సెల్ఫీలే తీసుకుంటూ., తీవ్రం గా గాయపడ్డాడనేది ఆ న్యూస్ సారాంశం. ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న తాజా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

శివ గత ఆదివారం బోరబండ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లో వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. రైల్వే హోంగార్డ్‌ వారిస్తున్నా ఎడమ చేత్తో సెల్‌ఫోన్‌ పట్టుకున్న శివ కుడిచేత్తో రైలును చూపిస్తూ ఫోజు ఇచ్చాడు. ఇంతలో ఎంఎంటీఎస్‌ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేశారు. వేగం తగ్గిన రైలు వచ్చి శివ కుడిచేతిని ఢీ కొట్టింది. దీంతో చేతికి బలంగా గాయమైంది.

అపస్మారకస్థితిలో పడివున్న శివను స్నేహితులు, రైవే హోమ్ గార్డ్ సాయంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎనిమిది నెలల క్రితం స్నేహితులతో కలిసి ఈ సెల్ఫీ వీడియో షూట్ చేశాడు శివ. ఆకతాయిగా చేసిన ఈ పనికి రైల్వే పోలీసులు అతనికి 500 జరిమానా విధించి ఈ వీడియోను ఎక్కడా అప్ లోడ్ చెయ్యద్దని సూచించారు.

అయినా ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదని శివ తాజా వీడియోలో చెబుతున్నాడు. తాను క్షేమంగా ఉన్నానని, ఎటువంటి ప్రాణాపాయం లేదని అందులో చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియోతోపాటు శివ సెల్ఫీ కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

Related News