ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఎవరు వుండరు. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నది. ఈ లీగ్ లో ప్రపంచదేశాలలోని క్రికెటర్స్ అందరూ పాల్గొంటారు. ఇప్పటికే ఈ లీగ్ 10 సీజన్ లను ముగించుకున్నది.
11వ సీజన్ ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నది. ఈ సీజన్ కు టైటిల్ కొత్త స్పాన్సర్ని బీసీసీఐ నియమించింది. అంతేకాక వచ్చే ఐదేళ్లు టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎం వ్యవహరించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు.
ఇప్పటికే పేటీఎం ఇండియన్ క్రికెట్‌కు టైటిల్ స్పాన్సర్‌గా ఉంటున్నది. ఈ సంబంధాలు ఈ ఏడాది ఐపీఎల్‌కు కొనసాగుతున్నాయి. పేటీఎం, బీసీసీఐ రెండు సత్సంబంధాలు కొనసాగుతాయి. పేటీఎంకు బీసీసీఐ గొప్ప విలువ ఇస్తుంది అని రాజీవ్ తెలిపారు.
గత సీజన్ కోసం వివో సంస్థ రూ.100 కోట్లతో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. గతంలో డిఎల్ఎఫ్, పెప్సీకో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. కాగా 2018 సీజన్ నుంచి 2022 వరకూ పేటీఎం సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ని రూ.439.8 కోట్ల వెచ్చించి దక్కించుకున్నట్లు సమచారం.