//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొత్త రూల్ : సాయంత్రం 6 వరకే మద్యం అమ్మకాలు

Category : health state

సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ వేస్తున్న ఏపీ సీఎం జగన్.. మద్య నిషేధంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మద్య నిషేధం కోసం కొత్త పాలసీని రూపొందిస్తున్న జగన్ ప్రభుత్వం.. కొత్త ఆలోచన చేస్తోంది. మద్యం వినియోగం తగ్గాలంటే అమ్మకాల సమయాల్లోనూ మార్పులు తేవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మద్యం అమ్మకాల విషయంలో కొత్త టైమింగ్స్ తీసుకురానుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకే మద్యం అమ్మకాలు జరగాలని.. సాయంత్రం 6 దాటితే లిక్కర్ సేల్స్ బంద్‌ చేయాలని భావిస్తోంది.నూతన లిక్కర్ పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వం పలు రకాల ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. అందులో సమయం కుదింపు అంశం ఒకటి. కొత్త పాలసీలో మద్యం వినియోగాన్ని

బాగా తగ్గించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.లిక్కర్ సేల్స్ సమయాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇకపై అలా కాకుండా.. సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. సాయంత్రం 4 గంటలు తగ్గిస్తే అమ్మకాలు పెద్దఎత్తున తగ్గిపోతాయనేది ప్రభుత్వం భావన.సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రి వరకే లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. మందుబాబులు ఎక్కువగా రాత్రే మద్యం తాగుతారు. ఉదయం పనులకు వెళ్లి వచ్చిన కూలీల్లోనూ ఎక్కువ మందికి రాత్రి మందు తాగే అలవాటు ఉంటుంది.

అందువల్లే రాత్రి లిక్కర్ షాపులు కిటకిటలాడుతుంటాయి. ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా. ఇది ప్రతిపాదన మాత్రమే. దీనిపై అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వమే షాపులు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనుంది. సమయాన్ని తగ్గిస్తే సిబ్బంది పని విధానం కూడా సులభం అవుతుందనేది మరో ఆలోచన. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. అది ప్రభుత్వానికి అదనపు భారం. అందువల్ల సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే

ఒకే షిఫ్టుతో సిబ్బందితో పనిచేయించుకోవచ్చు.మద్యం అమ్మకాల సమయం కుదించాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. మందుబాబులకు ఇది కాస్త షాకింగ్ న్యూసే. దీనిపై డిస్కషన్ నడుస్తోంది. సాధారణంగా సాయంత్రం తర్వాతే ఎక్కువగా తాగుతుంటారు. సాయంత్రానికి పనులన్నీ ముగించుకుని లిక్కర్ షాపుకి వెళ్లే వారున్నారు. సాయంత్రం 6 తర్వాత షాపులు మూసి వేస్తే కొంత ఇబ్బందే అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది తప్పదనేది కొందరు అధికారుల మాట. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుందని వారంటున్నారు. మద్యం అమ్మకాల సమయం కుదింపు అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి.