//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిసెంబర్ కు కొత్త రూ 1,000 నోట్

Category : national


ఇటీవల రూ.200 నోటును మార్కెట్లోకి విడుదల చేసిన భారతీయ రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా రూ.1000 నోటు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గత ఏడాది పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించడంతో రూ.1000 నోట్లు చెల్లకుండాపోయిన విషయం తెలిసిందే. నూతన డిజైన్‌తో, సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ.1000 నోట్లను డిసెంబర్‌ కల్లా మార్కెట్‌లోకి తేవాలని ఆర్బీఐ భావిస్తున్నది.

నోట్లరద్దు తర్వాత తక్షణ మార్కెట్ అవసరాలకు రూ.2000, రూ. 500 నోట్లను తెచ్చింది. ఈ నోట్ల మధ్య తేడా అధికంగా ఉండడంతో రూ.1000నోటు అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వం ఎక్కడా రూ. 1000 నోటు తెస్తున్నట్లు ప్రకటించలేదు. కానీ నోట్ల రద్దు తర్వాత మార్కెట్‌లో నగదు కొరతపై అందిన పలు నివేదికల్లో రూ.1000 నోటు తేవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈనేపథ్యంలో ఆర్బీఐ రూ.1000 నోటు ను తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.

మైసూరు (కర్ణాటక), సల్బోని(పశ్చిమబెంగాల్)లోని ప్రింటింగ్ ప్రెస్‌లలో రూ.1000 నోట్ల ముద్రణకు ఏర్పాట్లు చేస్తున్నదని సమాచారం. ఆర్బీఐ గత వారం చెలామణీ లోకి తెచ్చిన రూ.200 నోటు ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. రూ.100, రూ.500 మధ్య తేడా ఎక్కువ గా ఉండడంతో ఆ ఖాళీని రూ.200 నోటు భర్తీ చేస్తున్నది. ఏటీఎంలలో ఈ నోట్లు లభించడానికి సమయం పట్టొచ్చని తెలుస్తున్నది. కొత్త నోట్లు వస్తున్నా, రూ. 2000 నోట్లను రద్దు చేయబోమని ఆర్థికశాఖమంత్రి జైట్లీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.