//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు!

Category : sports

క్రికెట్ లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది.

ఆస్ట్రేలియాలో లోకల్ లీగ్ లు ఆడుతున్న కుర్రాళ్లు ఇటీవలి కాలంలో గుర్తుండిపోయే రికార్డులు నమోదు చేస్తున్నారు. ఇటీవలే వెస్టర్ అగస్టా బీ గ్రేడ్ కు చెందిన ఆటగాడు, 40 సిక్సులతో 307 పరుగులు కొట్టి ట్రిపుల్ సెంచరీ సాధించగా, ఇప్పుడో విక్టోరియన్ థర్డ్ గ్రేడ్ క్రికెటర్ మరెవరూ సాధించలేకపోయిన రికార్డు తన పేరిట సృష్టించాడు.

యాల్లౌర్న్ నార్త్ తరపున ఆడుతున్న నిక్ గూడెన్, పది బంతులేసి ఎనిమిది వికెట్లను తీయడంతో పాటు ఓ రన్నౌట్ తో కలిపి ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇందులో ఐదు వరుస బాల్స్ లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం. ఇదెలా జరిగిందో తనకూ అర్థం కాలేదని, కానీ ఓ మరపురాని అనుభూతి మాత్రం కలిగిందని మ్యాచ్ అనంతరం 'వీకెండ్ సన్ రైజ్' పత్రికతో గూడెన్ తన అనుభవాలు పంచుకున్నాడు.

Related News