//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రికెట్ లో సంచలనం ! : 870 పరుగుల తేడాతో గెలిచిన జట్టు

Category : sports

గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకూ ఇంత పెద్ద విజయాన్ని ఎవరూ ఊహించి కూడా ఉండరేమో.

ఓ జట్టు ఇన్నింగ్స్ 870 పరుగుల తేడాతో మరో జట్టును ఓడిస్తుందంటే నమ్మగలరా కానీ అదే జరిగింది. ఇంత సంచలనానికి వేదికగా నిలిచింది విజయ్‌ మర్చంట్‌ (అండర్‌-16) ట్రోఫీ. ఈ ట్రోఫీ లో బిహార్‌, అరుణాచల్ ప్రదేశ్ జట్లు తలపడగా జట్లు తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఆరుణాచల్‌ ప్రదేశ్, 83 పరుగులకే కుప్పకూలగా, బ్యాటింగ్ లో విధ్వంసం చూపిన బీహార్ ఏకంగా 1007 పరుగులు చేసింది.

బిన్నీ ట్రిపుల్‌ సెంచరీ (358), ప్రకాశ్‌ డబుల్‌ సెంచరీ (220) చేశారు. ఆపై రెండో ఇన్నింగ్స్ కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ 54 పరుగులకే కుప్పకూలింది. దీంతో బీహార్ జట్టు, ఇన్నింగ్స్ 870 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరుణాచల్ రెండు ఇన్నింగ్స్ లో ఆరుగురు ఆటగాళ్ల చొప్పున డక్కౌట్ కావడం గమనార్హం.