//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

kl రాహుల్ కాతాలో సరి కొత్త రికార్డ్

Category : sports

శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే ఎపుడు అదొక రికార్డ్ సృష్టించే టీం ఇండియా ఆటగాళ్లు ఈ మ్యాచ్ లోను అదే లికించారు అలంటి ఇలాంటి రికార్డ్ కాదు అదొక సరికొత్త చెత్త రికార్డు.భారత్ యువ ఓపెనర్ లోకేష్ రాహుల్ నిదహాస్ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో స్పిన్నర్ జీవన్ మెండిస్ వేసిన బంతిని ఆడేందుకు బ్యాక్‌ఫుట్ వేసిన రాహుల్ ప్రమాదవశాత్తు బెయిల్స్‌ను పడగొట్టి హిట్ వికెట్ అయ్యాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో హిట్ వికెట్ అయిన తొలి క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.ఇప్పటికే టెస్టుల్లో లాలా అమర్‌నాథ్ 1949 లో చెన్నై లో జరిగిన వెస్ట్ ఇండీస్ తో 4 th టెస్టులో 13 పరుగులు చేసి హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. వన్డేల్లో నయన్ మోగింయా 1995 లో జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు ఇప్పుడు టీ20ల్లో లోకేశ్ రాహుల్ ఆ ‘ఘనత’ సాధించాడు ఈ మ్యాచ్‌లో రాహుల్ 18 పరుగులు చేశాడు కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ మార్గాన్ని సుగమం చేసుకుంది.ఏమైతేనేం భారత ఆటగాళ్ల కాతాలో మరో రికార్డ్ చేరింది