టీం ఇండియా మరో యువ క్రికెటర్ కర్ణాటక నుండి సెలెక్ట్ చేసారు సెలెక్టర్లు .కర్ణాటక కి చెందిన మయాంక్ అగర్వాల్ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘ఇండియన్ టీం లో ఒక్కడినైనందుకు చాలా సంతోషం గా ఉన్న ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా చాలా క్రికెట్ ఆడా.
ఆ కారణం గా నా ఆటమీద ఫోకస్ పెరిగేలా చేసింది. నేను క్రికెటర్ గా పరుగులు చేయడమే నా బాధ్యత. ఇంకా నాకు ఏమి రాదు అవ్సరలేదు అంతే . నా ప్రదర్శను ఇలానే కొనసాగించడం.. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తూ మెరుగుపరుచుకోవడమే నాకు కావాలి. నా ఆట కు ఎప్పుడు ద్రావిడ్ నుండి సాయం ఉంటది . ఏం జరిగినా.. జరగబోతున్నా..
పరుగులు చేయడానికే కట్టుబడి ఉండని అతను చెప్పిన సలహాను పాటించాను. ఇది నాకెంతో ఉంపయోగపడింది. నేనెప్పుడు కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్ముతాన’ని చెప్పుకొచ్చాడు.
దేశవాళీతో పాటు భారత ‘ఎ’ జట్టు తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేయడంతో అగర్వాల్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. జట్టు లో సమర్థుడైన ఓపెనర్ అయినప్పటికీ జట్టు కొన్ని పరిస్థితులరీత్యా అతడు ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే, ధావన్, విజయ్‌ల వరుస వైఫల్యాల నేపథ్యంలో మయాంక్ అవకాశం వచ్చింది.
తుది జట్టులో చోటు కోసం పృథ్వీ షాతో పోటీ ఉన్నా... అనుభవం రీత్యా అతడికే ముందుగా అవకాశం రావొచ్చు. అదే జరిగితే కర్ణాటక సహచరుడైన లోకేశ్ రాహుల్‌తో కలిసి మయాంక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.