Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Goair Offers | మరో ఆఫర్ తో గో ఎయిర్.........!

Category : national

చౌక ధరల విమానయాన సంస్థ గో ఎయిర్ మరో చవక ఆఫర్‌తో ముందుకు వచ్చేసింది. దేశీయ ప్రయాణికుల కోసం అన్ని పన్నులతో కలుపుకుని రూ.991కే టికెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై టికెట్లను బుక్ చేసుకునే వినియోగదారులు అదనంగా మరో పదిశాతం రాయితీ పొందవచ్చు. అయితే ఇందుకోసం ‘GOHDFC10’ అనే ప్రోమోకోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

గో ఎయిర్ వెబ్‌సైట్ ప్రకారం.. బాగ్డోగ్రా నుంచి గువాహటికి రూ.991కే టికెట్ ఆఫర్ చేస్తుండగా గువాహటి నుంచి బాగ్డోగ్రాకు రూ.1,299, కోచి నుంచి బెంగళూరుకు రూ.1,390, హైదరాబాద్ నుంచి చెన్నైకి రూ.1,399, కోచి నుంచి చెన్నైకి రూ.1,540, పట్నా నుంచి రాంచీకి రూ.1,560, చెన్నై నుంచి కోచికి రూ.1,653, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1,731 కనీస ధరలతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. కాగా, ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Related News