//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Category : politics

రాజకీయ నిరుద్యోగులు, ఆశావహులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది.

అలా షెడ్యూలొచ్చిందో లేదో...అభ్యర్థుల ఎంపిక పై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ నుంచి పెద్దల సభకు ఎవరు వెళతారన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖంగా ఈ రేసులో ప్రధానంగా మంత్రి యనమల రామకృష్ణుడు పేరు తెరపైకి వస్తోందట. ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారట... ఇదే ప్రచారం చాలా నెలలుగా జరుగుతోంది.

ఇప్పుడు షెడ్యూల్ రావడంతో ఆయనకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం మరలా మొదలయ్యింది. అలాగే జేపీ పేరు కూడా తెరపైకి వచ్చింది. అదేమిటి లోక్ సత్తా పార్టీ అధినేత కి తెలుగుదేశం పార్టీ ఎలా రాజ్యసభకి పంపనుందా అని అయితే ఇక్కడే టీడీపీ నేతలు ఓ లాజిక్‌ చెబుతున్నారు, అదేంటి అంటే పార్టీకి ఏ సంబంధం లేకపోయినా... ఏపీ వాదనను ఢిల్లీలో బలంగా వినిపించే వారికి చంద్రబాబు అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారని వారు అంటున్నారు.

ఇప్పటీకే రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలుపెట్టిన చంద్రబాబు, పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుగుదేశం వర్గాల సమాచారం. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని చివరి నిముషం వరకు పేర్లు బయటకు రావడం కష్టమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉన్న సంఖ్యా బలం ప్రకారం టీడీపీ రెండు స్థానాలకు గెలచుకోవడం నల్లేరు మీద నడకే...ఇక మిగిలిన ఒక్క స్థానం వైసీపీకి వస్తుంది.

వైసీపీ నుంచి నెల్లూరుజిల్లాకు చెందిన వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు ఖాయమైనట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీకి ఆ ఒక్క స్థానం దక్కుతుందా లేదా అన్నది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. వైకాపాకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కనుక టీడీపీకి మద్దతు పలికితే... పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉందట. ఈ మూడు సీట్లలో ఎవరు ఎంపీలుగా ఎన్నికయి పెద్దల సభకి వెళతారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.