Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీకి కొత్త పేరు

Posted 20 days ago | Category : national

భీమా కోరేగావ్ అల్లర్ల అంశం ఇవాళ లోక్‌సభలో దుమారం రేపింది.

ఆ అల్లర్ల వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. సమాజంలోని కులాల మధ్య ఆరెస్సెస్ చిచ్చుపెడుతోందనీ...మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న హింసకు అరెస్సెస్‌ దే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడల్లా ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

జీరో అవర్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. దేశంలో దళితులను టార్గెట్ చేస్తున్నారని మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. మోదీని ‘‘మౌని బాబా’’గా అభివర్ణించిన ఖర్గే... మహారాష్ట్ర హింసపై ఇకనైనా ప్రధాని నోరువిప్పాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్‌సభలో మాట్లాడిన ఖర్గే... కొన్ని నియంతృత్వ శక్తులు దళితులను అణిచివేయాలని చూడడం వల్లే మహారాష్ట్రలో హింసాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు.

భీమా-కోరెగావ్ యుద్ధం ద్విశత వార్షికోత్సవ వేడుకల్లో తలదూర్చేందుకు ప్రయత్నించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గుజరాత్‌లో కావచ్చు... ఉనా, రాజస్థాన్.. ఇలా బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి చోటా అన్యాయమే రాజ్యమేలుతోంది. దీనిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి..’’ అని ఖర్గే డిమాండ్ చేశారు. మహారాష్ర్టతో పాటు రోహిత్ వేముల ఘటనను ఆయన గుర్తు చేశారు. ఆత్మగౌరవంతో దళితులు బ్రతకాలని భావిస్తున్నప్పుడు, కొందరు వారిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. భీమా కోరేగావ్‌లోనూ ఇదే జరిగిందన్నారు. ప్రతి ఏడాది దళితులు భీమా కోరేగావ్ స్మారకం వద్ద నివాళి అర్పిస్తారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని ఖర్గే అన్నారు.

ఈ సమయంలో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్ జోక్యం చేసుకున్నారు. మహారాష్ట్ర ఘటనను ఖర్గే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలోనూ విఫలమవుతున్నదని, అందుకే ఈ అంశాన్ని ప్రజ్వలింప చేస్తున్నదని విమర్శించారు. విభజించి, పాలించు అన్న విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని మంత్రి అనంత్‌కుమార్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది.

తృణామూల్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా భీమా కోరేగావ్ సమస్యను సభలో లేవనెత్తారు. హింసను ఖండిస్తున్నామన్నారు. అల్లర్లను, హింసను అదుపు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. శివసేనకు చెందిన శివాజీ పాటిల్ కూడా మాట్లాడారు. సంఘటనను మరాఠా వర్సెస్ దళిత్ యుద్ధంగా చిత్రీకరిస్తున్నారని, కానీ అది తప్పు అని ఎంపీ శివాజీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కప్పిపుచ్చేందుకే అల్లర్లను హైలైట్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధాన్వే తెలిపారు. భీమా కోరేగావ్ అంశాన్ని కూడా విపక్షాలు రాజ్యసభలో ప్రశ్నించాయి. దీంతో సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే