//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిసెంబరులో కొత్త విద్యావిధానం... కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌

Category : national

వలసవాద భావజాలంతో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా విధానంలో మార్పులు చేసి డిసెంబరులో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ సోమవారం తెలిపారు. కొత్త విద్యావిధానంపై కూలంకుషంగా జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత విద్యావేత్తలలో అత్యధికులు దురదృష్ట వశాత్తు బ్రిటీషు, పాశ్చాత్య స్కాలర్ల అడుగుజాడలనే అనుసరించారని, భారతీయ సంస్కృతిని ఉద్దేశపూర్వకంగా తృణీకరించారని అన్నారు. భారతీయుల ఆలోచన నుంచి వలసవాద భావాలను ఎలా తొలగించాలన్నదే ప్రస్తుత విద్యా వ్యవస్ధ, ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలని సింగ్‌ చెప్పారు.

ప్రాథమిక స్థాయిలో విద్య నాణ్యతను మెరుగుపరచడం, ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అత్యధిక మందికి విద్య అందేలా చూడటం తదితర సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో సోమవారం నేషనల్‌ అకడమిక్‌ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు.