//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత జట్టుకు కొత్త కోచ్ ?

Category : sports

భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది బీసీసీఐ. గతేడాది జూన్‌లో కోచ్‌ బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుంబ్లే పదవీకాలం వచ్చే నెలతో పూర్తికానున్నది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోచ్‌ బాధ్యతలు చేపట్టిన కుంబ్లే ఏడాదిపాటు జట్టును విజయపథంలో నడిపాడు. కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక భారత జట్టు 17 టెస్టుల్లో 12 విజయాలు, నాలుగు డ్రాలు, ఒక మ్యాచ్‌ మాత్రమే ఓడిపోయింది. ప్రపంచంలో ఏ కోచ్‌ అయినా ఇలాంటి గణంకాలు నమోదు చేస్తే వారినే కొనసాగిస్తారు. కానీ ప్రస్తుతం బీసీసీఐ మాత్రం కొత్త వారిని ఆహ్వానిస్తోంది. బీసీసీఐ క్రికెట్‌ సలహా సంఘం సభ్యులైన సచిన్‌ తెందుల్కర్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ సిఫారసుల మేరకు అనిల్‌కుంబ్లేను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.