//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికా అధ్యక్షుడు కి కొత్త కారు..!

Category : national

అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ కు అధిక రక్షణ సమకూర్చే పనిలో ‘అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌’ బిజీగా ఉంది,దీనిలో భాగంగా సరికొత్త క్యాడిలాక్‌ బీస్ట్‌ కారును సిద్ధం చేస్తోంది. అతి పెద్ద ఆటోమొబైల్‌ సంస్థ అయిన జనరల్‌ మోటార్స్‌ అధ్యక్షుడి కోసం దీన్ని రూపొందిస్తోంది.

పేరుకు మాత్రమే ఇది కారు, కానీ, ఒక యుద్ధ ట్యాంకు తో సమానం.దీనిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అధ్యక్షుడితో పాటుగా ఆ కారులో ఆయన వ్యక్తిగత సహాయకుడు, భద్రతా సిబ్బంది సైతం ఇదే కారులో ప్రయాణించే సదుపాయం ఉంది. అంతేగాక ప్రమాదం ఎదురైనప్పుడు అధ్యక్షుడికి అత్యవసరంగా చికిత్స అన్ని రకాల సదుపాయాలు ఇందులో అమర్చుతూఉన్నారు.

ట్రంప్‌ వినియోగించబోయే క్యాడిలాక్‌ కారు తయారీకి 15 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.100 కోట్లు) ఖర్చు చేస్తున్నారు. అధ్యక్షుడి అవసరాలకు అనుగుణంగా ఈ కార్లను గత 20ఏళ్లుగా జనరల్‌ మోటార్స్‌ తయారు చేస్తోంది. ట్రంప్‌ కోసం మరికొన్ని అదనపు భద్రత, సౌకర్యాలతో కొత్త కారును రూపొందించి దాన్ని పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నారు. వచ్చే నెలరోజుల వ్యవధిలో ఇది అధ్యక్షుడి కోసం అందుబాటులోకి రానుంది

అధ్యక్షుడి కారు లోని ప్రత్యేకతలు :

దీని పొడవు 18 అడుగులు. బరువు 8 టన్నులు. గరిష్ఠ వేగం- గంటకు 60 మైళ్లు.

ముందువరుసలో డ్రైవర్‌తో పాటు మరొకరు, మధ్యవరుసలో ముగ్గురు, చివరి వరుసలో ఇద్దరు కూర్చునే సీటింగ్‌ ఏర్పాటు దీన్లో ఉంటుంది.ఈ కారు నుంచే అత్యాధునిక ఆయుధాలు ప్రయోగించవచ్చు.

మందుపాతర్లు, రోడ్డుపక్కన పాతిపెట్టిన బాంబులు పేలి ఇంధన ట్యాంకు దెబ్బతినకుండా దాన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌, పేలుడు నిరోధ ప్రమాణాలతో నిర్మించారు.ఒక్కో తలుపు బోయింగ్‌ 747 విమానం తలుపు అంత బరువుగా ఉంటుంది.

టైర్లు పేలినా ఇబ్బంది ఏమీ ఉండదు. కారు యధావిధిగా ముందుకు సాగుతుంది. ఇందుకు వీలుగా ‘కేవ్లర్‌’ కోర్‌ టైర్లు బిగిస్తారు.కారు లోపల షాట్‌ గన్‌, కారు వెనుక బంపర్‌లో టియర్‌ గ్యాస్‌ క్యానన్లు ఉంటాయి.

ఈ కారు లో అధునాతన సమాచార వ్యవస్థ సదుపాయాలు ఉండటం మరొక ప్రత్యేకత. ఈ కార్లో కూర్చునే అమెరికా అధ్యక్షుడు దూరదృశ్య సమీక్ష నిర్వహించవచ్చు.