//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్మిత్ తో "సూపర్" విజయం

Category : sports

ఐపీఎల్ -10 లో తన తోలి మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో బోణీకొట్టింది పూణే సూపర్ జాయింట్. కొత్త కెప్టెన్ స్మిత్ సూపర్ బ్యాటింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్ 184 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (38), పార్థివ్‌ పటేల్‌ (19) తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగి 45 పరుగులు చేశారు. లెగ్‌స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ పార్థివ్‌ను ఔట్‌ చేసి ఈ జోడీని విడగొట్టాడు. ఆ తర్వాత తాహిర్‌ ఒకే ఓవర్లో రోహిత్‌శర్మ (3), బట్లర్‌ను ఔట్‌ చేయడంతో ముంబయి ఇబ్బందుల్లో పడింది. అప్పటికి స్కోర్ 62/3 . తరువాత వచ్చిన నితీష్ రానా (34 ) పరుగులు చేసి పర్వాలేదనిపిచ్చిన, హిట్టర్ పోలార్డ్ ( 27 ) మాత్రం నిరాశపరిచాడు. పోలార్డ్ అవుట్ అయ్యే సమయానికి 18.2 ఓవర్లలో 146 పరుగులు చేసింది. క్రీజ్ లోకి వచ్చిన హర్ధిక్‌ పాండ్య అశోక్‌ దిండా వేసిన ఆఖరి ఓవర్లో సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాదిన అతను నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఐదో బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపిన పాండ్య స్కోరును అమాంతం పెంచాడు. పాండ్య దెబ్బతో ముంబయి 184/8తో ఇన్నింగ్స్‌ ముగించింది.

లెగ్‌స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (3/28) రాణించి ముంబయి కట్టడి చేయడంలో ముఖ్య పాత్ర పోచించాడు. ఛేదన ఆరంభించిన పూణే, రహానే (60 ) దూకుడు ఇనింగ్స్ కి స్మిత్(84 ) , స్టోక్స్‌ (21), ధోని (12 ) పరుగులతో విజయం సాధించింది. కానీ చివరి ఓవర్ లో 13 పరుగులు అవసరమవగా తొలి మూడు బంతులకు 3 పరుగులే వచ్చాయి. అయితే కెప్టెన్ స్మిత్ వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్ ని ముగించాడు.  

Related News