ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ దర్శనం ఇస్తున్నాయి..ఎన్నో డబ్బులు పెట్టి ఈ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు..కానీ అవి కింద పడగానే పగిలిపోతుండడం తో భాద పడుతున్నారు.ఇక నుండి స్మార్ట్ ఫోన్స్ కింద పడిన పగలవాట..తాజాగా శాస్త్రవేత్తలు మిరకల్ మెటీరియల్ను కనుగొన్నారు.
మెరుగైన రసాయన స్థిరత్వం, కాంతి, ఫ్లెక్సిబిలిటీ సహాయంతో తయారయ్యే స్మార్ట్ఫోన్లు పగిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వీరు చెపుతున్నారు. ప్రస్తుతం చాలా స్మార్ట్ఫోన్లు సిలికాన్ అనే పదార్థంతో తయారవుతున్నాయి. ఈ రకం ఫోన్లు ఖరీదైనవి కావడంతోపాటు కిందపడితే సులభంగా పగిలిపోతాయి. అందుకే గ్రాఫీన్ వంటి లేయర్ల మెటీరియల్తో సెమీకండక్టింగ్ అణువులను కలపడం ద్వారా విశిష్టమైన మెటీరియల్ టెక్నాలజీని కనుగొన్నామని చెప్పారు. స్మార్ పరికరాల ప్రపంచంలో ఇది పెనుమార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. వీటితో స్మార్ట్ ఫోన్లు తయారీ చేస్తే అవి కిందపడిన పగిలిపోవని అంటున్నారు.