ప్రముఖ ఆన్లైన్ చాట్ అప్లికేషన్ 'స్నాప్‌చాట్'లోని తొలి పదంతో మొదలయ్యే పేరు ఉండటమే 'స్నాప్‌డీల్'కు చిక్కు తెచ్చి పెట్టింది.
నెటిజన్ల ఆగ్రహానికి అనవసరంగా బలైంది. వివరాళ్లోకెళ్తే స్నాప్‌చాట్ సంస్థ సిఇఒ ఇవాన్ స్పైగల్ ఇటీవల భారత్‌నుద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. భారత్ లాంటి పేద దేశాల్లో వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఇవాన్ ఆసక్తికనబరచరని స్నాప్‌చాట్ మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని నెటిజన్లు స్నాప్‌చాట్‌ను తమ స్మార్ట్ఫోన్లలోంచి డిలీట్ చేయాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్నాప్‌చాట్‌కు బదులు ప్రముఖ ఆన్లైన్ సంస్థ స్నాప్‌డీల్ ఆప్‌ను డిలీట్ చేయడమేగాక, దీనికి తక్కువ రేటింగ్ ఇచ్చారు. తమ బ్రాండ్ అంబాసిడర్ అమీర్‌ఖాన్ వివాదం నేపథ్యంలో 2015లోనూ స్నాప్‌డీల్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.