//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ టీడీపీ ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో వేధింపులు...

Category : politics

తనపై సోషల్ మీడియాలో కుట్రపూరిత పోస్ట్లు పెడుతున్నారని ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించాడు. దీని వలన తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత బడేటి బుజ్జి పోలీసులకు తెలియచేసారు. వీరిలో కడప జిల్లా రాయచోటికి చెందిన ఎం. నాగూర్ బాబు, సయ్యద్ బాజీ, ఎం బాషా, జి.మస్తాన్ వలీలపై ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో బుజ్జి ఫిర్యాదు చేశారు.Netizens Sensational Comments on tdp MLA

'ఎమ్మెల్యే బుజ్జి ఖబడ్డార్‌, ఇదే ఏపీ ముస్లిం యువత హెచ్చరిక' అంటూ ఫేస్ బుక్ లో తనపై తప్పుడు ప్రచారం ప్రారంభించారని తెలిపారు. తన పేరు, ప్రతిష్టలు దెబ్బతీసేలా వీరు వ్యవహరించారన్నారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు ‘నేటి ప్రస్థానం’ అనే దినపత్రికలో 'బుజ్జీ ఖబడ్డార్' అనే శీర్షికతో ప్రచురించామని తెలిపారు. దీంతో సీఐ జి.మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు నలుగురు నిందితులపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతం అయినా తరువాత ఈ లాంటి పోస్టులు వలన చాల మంది ఇబ్బంది పడుతున్నారు.

Related News