//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యే అనీల్‌ను ఛీ కొడుతున్న నెల్లూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు..!

Category : politics

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంతో కేవ‌లం రాజ‌ధాని అమ‌రావ‌తినే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వెనుక‌బ‌డిన ప్రాంతాల‌ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీ లోటు బ‌డ్జెట్‌లో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌న్నిన కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతున్నారు. అటు ఏపీ అభివృద్ధి, ఇటు టీడీపీ బ‌లోపేతం ఇలా చంద్ర‌బాబు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. 


అయితే, సీఎం చంద్ర‌బాబు నాయుడు పేద‌ల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తార‌న్న విషయం ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే, ఏపీ వ్యాప్తంగా పేద‌లకు సొంత ఇంటి క‌ల‌ను వేర‌వేర్చాల‌న్న సంక‌ల్పంతో ఇళ్ల నిర్మాణం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అందుకు, షేర్ వాల్ టెక్నాల‌జీని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉప‌యోగించింది. అందులో భాగంగానే, ఏపీ పుర‌పాల‌క‌శాఖ మంత్రి నారాయ‌ణ త‌న సొంత జిల్లా అయిన నెల్లూరు న‌గ‌రంలో పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టి ఇవ్వాల‌నే సంక‌ల్పించారు. అందుకు అనుగుణంగా, ల‌బ్ధిదారుల ఎంపిక చేయ‌డంతోపాటు.. వారికి ఇళ్లను ఇర్మించి ఇవ్వ‌డం కూడా జ‌రిగింది. 




ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏ సంక్షేమ కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టినా ఓర్చుకోలేని ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు రోజువారిలానే నెల్లూరులో ప్ర‌భుత్వం నిర్మించిన ఇళ్ల‌కూ అడ్డుప‌డ్డారు. ల‌బ్ధిదారుల‌కు ఆ ఙ‌ల్లు ద‌క్క‌కుండా చేసేందుకు కుట్ర‌లు ప‌న్నారు. అందులో భాగంగా, నెల్లూరు ప‌ట్ణ‌ణ వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్, అత‌ని అనుచ‌రులు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఇళ్ల ల‌బ్ధిదారుల ఆధార్ కార్డుల‌ను దొర‌త‌నంగా కాకుండా.. దొంగ‌చాటుగా.. మాయ మాట‌ల‌ను చెప్పి వారి నుంచి తీసుకున్నారు.


 ప్ర‌భుత్వం నిర్మించిన ఇళ్ల‌కు.. పెన్నా న‌ది నుంచి ప్ర‌మాదం పొంచి ఉందంటూ మాయ‌మాట‌లు చెప్పి ఇళ్ల ల‌బ్ధిదారుల నుంచి తీసుకున్న ఆధార్ కార్డుల‌ను జోడించి ఉమ్మ‌డి హై కోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. స‌మాధానం చెప్పాలంటూ ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. నోటీసుల‌ను అందుకున్న చంద్ర‌బాబు స‌ర్కార్ వెంట‌నే స్పందించి.. వైసీపీ కోర్టుకు సమ‌ర్పించిన ప‌త్రాలు, ఆధార్ కార్డులు త‌ప్పుడువ‌న్న అంశాల‌ను ఆధారాల‌తో స‌హా కోర్టులో రుజువు చేసింది. దీంతో హైకోర్టు వైసీపీ వేసిన పిటిష‌న్‌ను కొట్టేసింది. 


ఇలా, వైసీపీ నేత‌లు చేసిన త‌ప్పుడు ప‌ని వ‌ల్ల తాము ఇళ్లను కోల్పోయేవార‌మ‌ని, అస‌లు తమ ఆధార్ కార్డుల‌ను వైసీపీ నేత‌లు తీసుకున్నార‌న్న విషయం త‌మ‌కు తెలియ‌ద‌ని, కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వైసీపీ నేత‌ల‌కు బుద్ధి చెప్పేందుకు, ఈ విష‌యంలో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన ఏపీ పుర‌పాల‌క‌శాఖ మంత్రి నారాయ‌ణ‌కు ఇళ్ల ల‌బ్ధిదారులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.



Related News