//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్డీటీవీ సర్వేలో కేసీఆర్ హీరో .. గులాబీ నేతల్లో జోష్

Category : politics state

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ప్రజలు పట్టం కట్టనున్నారా..? వివిధ సర్వేల్లో బయట పడుతున్న వాస్తవం అదేనా ? కూటమి అవేవి కరెక్ట్ కాదని ఫేక్ సర్వేలతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తుందా ? అంటే అవుననే చెప్తారు గులాబీ నాయకులు. అయితే కేసీఆర్ కే తిరిగి అధికారం కట్టబెట్టడం ఖాయమని ఇప్పటికే వివిధ సంస్థలు ఛానల్లు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడుపెను దుమారం రేపుతుంది. దీనికి తోడుగా మరో జాతీయ టీవీ ఛానల్ సైతం గులాబీ దళపతికి గుడ్ న్యూస్ చెప్పింది .

తియ్యటి వార్త అందించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మరోసారి విజయ ఢంకా మోగించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎన్డీటీవీ అభిప్రాయపడింది. గత నాలుగున్నరేళ్లలో ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న సానుకూలత కేసీఆర్ కు గులాబీ దళానికి కలిసొచ్చే అంశాలని చెప్పింది. అందుకే ఈ ఎన్నికలు మరోసారి విజయాన్ని చేకూర్చవచ్చని విశ్లేషించింది. తెలంగాణలో స్థానిక సంక్షేమ పథకాలే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నట్టు ఎన్డీటీవీ అధిపతి ప్రణయ్ రాయ్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ విజయవంతమైనట్టు ఆ చానల్ అభిప్రాయపడింది.తెలంగాణలోని పలు పథకాలు టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేస్తాయని ఎన్డీటీవీ విశ్లేషించింది. రైతు బంధు,వృద్ధాప్య పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ,గొర్రెల పంపిణీ పథకం,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెలంగాణలో పూర్తిగా విజయవంతమయ్యాయని తెలిపింది. రైతు బీమా పథకం ప్రాథమిక దశలో ఉందని రుణ మాఫీ పాక్షికంగా విజయవంతమైందని పేర్కొంది. ఇంటింటికీ తాగునీరు పథకం కింద పనులు పూర్తయినప్పటికీ కొన్ని ప్రాంతాలకు ఇంకా నీరు సరఫరా కావడం లేదని కానీ దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అని తెలిపింది.

తెలంగాణలో 9 నుంచి 10 శాతం మధ్య ఉన్న షెడ్యూల్డు తెగలు ఏడు శాతం ఉన్న లంబాడాలు టీఆర్ఎస్ పట్ల మొగ్గు చూపుతున్నారు. మూడు శాతం ఉన్న గోండులు, కోయలు టీఆర్ఎస్ తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఇక 18 నుంచి 20 శాతం మధ్య ఉన్న మాల మాదిగ కులాలకు చెందిన వారు ప్రభుత్వ ఓబీసీ అనుకూల విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందామని అంటున్నారు. కాబటి అది కూడా ప్లస్ అయ్యే అవకాశం వుంది. 12 శాతం ఉన్న ముస్లింలు హైదరాబాద్లో ఎంఐఎంకు పూర్తి మద్దతును తెలుపుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మాత్రం షాదీముబారక్ పథకంతో లబ్ధి పొందామంటూ ప్రభుత్వ అనుకూలతను చాటుతున్నారు. దక్షిణ తెలంగాణ కన్నా ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ అత్యంత పటిష్ఠంగా ఉన్నదని ఎన్డీటీవీ అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 20 శాతం ఓట్ల తేడాతో ఉత్తర తెలంగాణలో విజయం సాధించిందని తెలిపింది. అదే దక్షిణ తెలంగాణలో గెలుపు ఓటముల మధ్య తేడా 11 శాతంగా ఉన్నదని పేర్కొంది.మొత్తానికి ఎన్డీటీవీ సర్వే గులాబీ దళంలో జోష్ ఇచ్చింది. కేసీఆర్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

Related News