//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్డీటీవీ సీఈవో మృతి !

Category : national

ప్రముఖ ఆంగ్ల వార్తా చానెల్‌ ఎన్డీటీవీ గ్రూప్‌ సీఈవో, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేవీఎల్‌ నారాయణరావు(63) సోమవారం తుదిశ్వాస విడిచారు.

గత రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతి చెందినట్లు ఎన్డీటీవీ ఓ ప్రకటనలో తెలిపింది.కేవీఎల్‌ నారాయణరావుకు భార్య రేణు, ఇద్దరు కుమారులు జయంత్‌, అర్జున్‌ ఉన్నారు.

అయితే 1995లో ఎన్డీటీవీలో జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణరావు అంచలంచెలుగా ఎదిగారు. ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో స్థాయికి ఎదిగారు. జనరల్ మేనేజర్‌గా చేరిన నారాయణరావు అంచెలంచెలుగా ఎదిగి ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఎన్డీటీవీ పేర్కొంది.