//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్‌డీ తివారీ పరిస్థితి విషమం

Category : national politics

రాజకీయ కురువృద్ధుడు నారాయణ్‌ దత్‌ తివార్‌(92) ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర రావత్‌ తెలిపారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన తివారీని కుటుంబసభ్యులు గత ఏడాది సెప్టెంబర్‌ 20న ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాలు పనిచేయక పోవటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని రావత్‌ చెప్పారు.

మంగళవారం ఆస్పత్రికి చేరుకున్న రావత్‌.. తివారీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలు పనిచేయడం లేదనీ, కడుపులో ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తివారీ కొడుకు చెప్పారు.

Related News