//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ అసెంబ్లీలో కలకలం రేపిన ఎన్ సి ఎమ్మెల్యే అక్బర్..!

Category : national

అసెంబ్లీలోనే జై పాకిస్థాన్ నినాదాలు వినిపించాయి.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో చోటు చేసుకుంది.జమ్మూ కాశ్మీర్ లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులై ఈ ఉదయం జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సభలో బీజేపీ ఎమ్మెల్యేలు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేశారు.

అయితే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సీ) ఎమ్మెల్యే మహమ్మద్ అక్బరు లోన్ మాత్రం పాక్ కు వంత పాడారు.‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.ఈ ఘటనపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు.ఈ నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కవీందర్ గుప్తా ప్రకటించారు.ఈ విషయమై,

మహ్మమద్ అక్బరు మీడియాతో మాట్లాడుతూ,‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలను మహమ్మద్ అక్బరు సమర్థించుకున్నారు.నేను మొదట ముస్లింని.‘పాకిస్థాన్ నశించాలి’ అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను భరించలేకపోయాను.నా భావోద్వేగాలను అణచుకోలేకపోయాను.

అందుకే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాను అని అక్బరు అన్నారు.అంతేకాకుండా ఈ విషయమై ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు.'అవును ఆ నినాదాలు నేను చేశాను.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.సభలో నేను చేసిన ఈ నినాదాలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయని నేను భావించట్లేదు’ అని పేర్కొనడం గమనార్హం.

కాగా,జమ్మూకాశ్మీర్ లోని సంజ్ వాన్ ప్రాంతంలోని ఆర్మీ శిబిరంపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఉగ్ర దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా,ఆరుగురు గాయపడ్డారు.ఆర్మీ క్యాంపు పక్కన ఉన్న సైనికుల క్వార్టర్స్ నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.