//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమరావతికి షిఫ్ట్ అవుతున్నారా ?

Category : politics

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యామిలీ ద‌శాబ్ధాలుగా హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సొంత ఇల్లు జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ ప‌రిస‌రాల్లో జూబ్లీ చెక్ పోస్ట్‌కి అత్యంత స‌మీపంలో ఉంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్వ‌గృహానికి బాల‌య్య నివాసం ఎంతో చేరువ‌లో ఉంటుంది.

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, ప్ర‌హారీతో ఇల్లు ఎంతో సెక్యూరిటీ మ‌ధ్య ఉంటుంది. అయితే గత కొంత‌కాలంగా బాల‌కృష్ణ ఇంటి ప‌రిస‌రాల్లో షాపింగ్ మాల్ క‌డుతున్నార‌ని, ఆ ఇంటిని కూల్చేస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. ఈ వార్త‌ల్ని బాల‌య్య కాంపౌండ్ ఖండించింది లేదు… ధృవీక‌రించింది లేదు. దీంతో ఆ వార్త‌లు నిజ‌మేన‌ని భావిస్తున్నారంతా.

ప్ర‌స్తుతం మ‌రో వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. బాల‌కృష్ణ కుటుంబం హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు షిఫ్ట‌వుతున్నారంటూసోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తోంది. బాల‌య్య రాజ‌కీయాలు ఏపీకే ప‌రిమితం కాబ‌ట్టి .. ఎలానూ జూబ్లీ హిల్స్ ఇంటి ప‌రిస‌రాల్లో షాపింగ్ మాల్ నిర్మించే ఆలోచ‌న ఉంది కాబ‌ట్టి.. బెజ‌వాడ‌కు షిఫ్ట‌య్యేందుకు ప్లాన్ చేశారా? హిందూపురం(ఏపీ) ఎమ్మెల్యేగా బాల‌య్య రాజ‌కీయ భవిష్య‌త్ ఆంధ్రాలోనే కాబ‌ట్టి విజ‌య‌వాడ‌కు షిఫ్ట‌వుతున్నారా? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనేత్తుతున్నారు.

రాబోతున్న ఎన్నికలలోపే బాలయ్య తన నివాసాన్ని విజయవాడకు మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలను తన సన్నిహితులతో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు అందరికంటే ముందుగా హైదరాబాద్ వచ్చి తన శాశ్విత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విధంగా ఇప్పుడు బాలకృష్ణ అదే తరహాలో అందరికంటే ముందుగా తన నివాసాన్ని శాస్వితంగా విజయవాడకు మార్చాలి అని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.