//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పూర్తి ఢీ గ్లామర్ రోల్ లో......... నయన తార

Category : movies

తాజాగా తమిళ్ లేడీ సూపర్ స్టార్ గా, హిట్ మీద హిట్స్ సూపర్ హిట్స్ కొడుతూ తన నటన,గ్లామర్ తో దక్షిణాన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి "నయనతార " ఇపుడు తను మెయిన్ లీడ్ గా నటిస్తున్న తాజా చిత్రం "ఐరా " ఈ సినిమా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి విభిన్న కధాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభియనం చేస్తూ ఉండగా ఇందుకు సంబంధించిన ఒక టీసర్ ఇప్పటికే రిలీస్ చేయగా అందులో నయనతార పాత్ర తాలూకు లుక్ చూస్తేనే తెలుస్తుంది....

ఆ పాత్ర యెక్క స్థాయి ఏంటి అని.

ఈ చిత్రంలో నల్లటి శరీర రంగు ఛాయతో కనిపిస్తున్నది. గ్రామీణ నేపధ్య యువతి పాత్ర లో భవానీగా, ఆధునిక భావాలు కలిగిన పట్టణ అమ్మాయి యమునగా ఉండే భిన్న కోణాల్లో రెండు పాత్రలు తీర్చి దిద్దినట్టు చిత్రబృందం తెలిపింది. పల్లెటూరి యువతి పాత్రలో నలుపు రంగు ఛాయతో పూర్తిగా ఢీ గ్లామర్ రోల్ గా నయన్ కనిపిస్తున్నది.

ఈ పాత్ర కోసం నయనతారను ప్రత్యేకమైన మేకప్‌తో తీర్చిదిద్దినట్లు దర్శకుడు సృజన్ పేర్కొన్నారు.గత నయనతార నటించిన చిత్రాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా పూర్తి భిన్నంగా, ప్రయోగాత్మకంగా ఈ పాత్ర ఉంటుందని . ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆడపిల్లలపై సమాజంలో కొనసాగుతున్న వివక్ష,నిర్లక్ష్యం, లైంగికదాడుల వంటి ప్రధాన ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏక కలం లో తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదలచేయబోతున్నట్టు సమాచారం .

Related News