దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు.ఇటీవలే విశాల్ సిక్కా రాజీనామా చేయగా, ఇపుడు మరో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బుధిరాజ్ రాజీనామా చేశారు. దీంతో గత ఏడాది మార్చి తరువాత కంపెనీని వీడిన మాజీ స్టాఫ్ఎగ్జిక్యూటివ్ల సంఖ్య12కు చేరింది.
నవీన్ బుధి రాజ్ ఇన్ఫోసిస్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టెక్నాలజీ విభాగం అధిపతిగా పని చేస్తారున్నారు. బుధిరాజా నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి మాకు అర్హత లేదంటూ ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధిరాజా 2014, ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరారు. జర్మన్ సాఫ్ట్వేర్ జెయింట్ సాప్‌నుంచి దాదాపు 16 మంది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సీనియర్ ర్యాంకులతో ఇన్ఫోసిస్‌లో చేరిన వారిలో ఈయన కూడా ఒకరు.