//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వెంకయ్య కు నవీన్ పట్నాయక్ షాక్ !

Category : national

అన్ని రాజకీయ పక్షాలతో మంచి సంబంధాలు ఉన్న వెంకయ్యనాయుడు ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో రాజ్యసభలో ప్రతిపక్షాలతో మంచి సంబంధాలు ఏర్పర్చుతారని భావించిన బిజెపి అధిష్టానానికి ఆయన నామినేషన్ దాఖలు చేయగానే షాక్ తగిలింది. రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇచ్చిన పలువురు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 

రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లభించినట్లే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ భారీ మద్దతు లభిస్తుందని భావించిన బీజేపీకి  బీజేడీ షాకిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీనే తాము బలపరుస్తామని ఆ పార్టీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన  రామ్‌నాథ్‌ కోవింద్‌ను సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి పోలింగ్‌ ముగిసి 24 గంటలైనా గడవకముందే బీజేపీకి మింగుడుపడని నిర్ణయం తీసుకున్నారు నవీన్‌ పట్నాయక్‌. రెండు రోజుల ముందే కోవింద్ కు మద్దతు ఇచ్చిన జెడి (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహితం గాంధీకే మద్దతు ప్రకటించారు. 

యూపీఏ అభ్యర్థి గాంధీ తనకు చిరకాల మిత్రుడని,  రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము స్నేహితులమని పట్నాయక్ తెలిపారు. ప్రస్తుతం బీజేడీకి పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలున్నారు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది.