//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేచుర‌ల్ స్టార్ నాని పై హైకోర్టులో కేసు..శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం..!

Category : movies

టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని, మెగాస్టార్ చిరంజీవిలా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స‌హ‌జ న‌ట‌న‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాకుండా, వ‌రుస చిత్రాల‌తో రెండు హ్యాట్రిక్ విజ‌యాల‌ను కూడా నాని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇలా నిర్మాత‌ల హీరోగానే కాకుండా, మ‌న ప‌క్కింటి అబ్బాయిలా ఉన్నాడే అని సినీ జ‌నాలు అనుకునే ఇమేజ్ నాని సొంతం. అటువంటి నానిపై ఇప్పుడు ఓ వార్త వైర‌ల్ అయింది. అయితే, ఈ వార్త‌ను రిలీజ్ చేసింది కూడా శ్రీ‌రెడ్డినే. ఇక అస‌లు విష‌యానికొస్తే, ఆదివారం ఓ సోష‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రెడ్డి నేచుర‌ల్ స్టార్ నానిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

అయితే,బిగ్ బాస్ - 2 సీజ‌న్‌లో మీకు ఆఫ‌ర్ వ‌చ్చిందంట క‌దా..? అన్న యాంక‌ర్ ప్ర‌శ్న‌కు స్పందించిన శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.. అవును నిజ‌మే వ‌చ్చింది. కానీ ఢిల్లీ టూర్ ఉండ‌టంతో తానే రిజెక్ట్ చేశానంటూ చెప్పింది. నానికి భ‌య‌ప‌డే రిజెక్ట్ చేశారా..? అని అడిగిన ప్ర‌శ్న‌కు.. నేనా.. నానికి భ‌య‌ప‌డ‌తానా..! నాని వాళ్ల తాత కూడా న‌న్ను చూసి భ‌య‌ప‌డాలి. అంతేకానీ, నేను భ‌య‌ప‌డ‌టం కాదు అంటూ సంచ‌ల‌న కామెంట్ చేసింది. అతి త్వ‌ర‌లో నానిపై హైకోర్టులో కేసు వేయ‌బోతున్న‌ట్టు కూడా చెప్పింది శ్రీ‌రెడ్డి. నాని న‌న్ను సెక్స్ కోసం వాడుకున్నాడు. మమ్మ‌ల్ని త‌ల్లుల్ని చేస్తార‌నో.. లేక మాకు ఆస్తులు ఇస్తార‌నో నేను నాని పిలిస్తే వెళ్ల‌లేదు. సినిమా అవ‌కాశాలు ఇస్తాన‌ని నాని చెప్పాడు కాబ‌ట్టే.. నానితో సెక్స్‌లో పాల్గొన్న‌ట్టు శ్రీ‌రెడ్డి చెప్పింది.