//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాసా సోలార్‌ పార్కర్‌ ప్రోబ్‌ ప్రయోగం......!

Category : national

సూర్యుడికి అత్యంత దగ్గరకు వెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆదివారం ప్రయోగించింది. కేప్‌ కెనెవెరాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి దీన్ని నింగిలోకి పంపారు. డెల్టా 4 భారీ రాకెట్‌ ద్వారా ఈ ప్రోబ్‌ నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రయోగాన్ని నిన్ననే చేపట్టాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా పడింది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3.31 గంటలకు డెల్టా-4 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరగాల్సింది. చివరి క్షణాల్లో ఇది వాయిదా పడింది. అయితే రాకెట్‌ నింగిలోకి బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు హీలియం అలారం మోగడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

150 కోట్ల డాలర్ల విలువైన ఈ వ్యోమనౌక విషయంలో ఇంజినీర్లు చాలా జాగ్రత్త వహిస్తున్నారని నాసా ఉన్నతాధికారి థామస్‌ జుర్బెచన్‌ పేర్కొన్నారు. తమకు ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన వ్యోమనౌక అని వివరించారు. సూర్యుడి వెలుపలి వాతావరణ వలయమైన కరోనాలోకి దూసుకెళ్లే ఈ వ్యోమనౌక.. సౌర తుపాన్లు, జ్వాలల గురించి అనేక వివరాలను వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. తద్వారా అంతరిక్ష వాతావరణ హెచ్చరికలను మరింత మెరుగ్గా చేయవచ్చు.