సాధారణంగా మనం పెద్ద పెద్ద నగరాల్లో రాత్రి వేళ చాలా ఎత్తులో నిల్చొని చూస్తూ..కింద చాలా వెలుగు జిమ్మిస్తూ నగరం చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఇదే మరి అంతరిక్షం నుంచి చూస్తే..ఒక్క సారి ఊహించుకోండి.
రాత్రివేళ విద్యుత్ కాంతులతో వెలుగు జిలుగులు వెదజల్లుతూ కనువిందు చేస్తున్న భారతదేశ చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా విడుదల చేసింది. వినువీధి నుంచి తీసిన ఈ ఉపగ్రహ చిత్రాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి. అంతరిక్షం నుంచి భూమి రాత్రివేళ కనిపిస్తున్న తీరును చూపిస్తూ ‘రాత్రి కాంతులు’ పేరుతో నాసా తాజా చిత్రాలను విడుదల చేసింది. చంద్రుడి కాంతి ప్రభావం పడకుండా.. ‘విసిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్(వీఐఐఆర్ఎస్)’ అనే ఉపగ్రహ పరికరం నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి వాటిని రూపొందించింది. 2016లో తీసిన భారత్ చిత్రం కూడా ప్రస్తుతం విడుదలైన వాటిలో ఉంది.