//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర బడ్జెట్‌ రైతు హిత బడ్జెట్ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!

Category : national

ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ రైతు హిత బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట. రైతుల కోసం జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు..

* వ్యవసాయ ఉత్పత్తుల కోసం పటిష్ఠమైన క్లస్టర్ విధానం.

* ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు.

* సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మరింత ప్రాధాన్యం.

* సేంద్రీయ వ్యవసాయం చేసేలా మహిళా సంఘాలకు ప్రోత్సాహం.

* గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు.

* రైతుల ఉత్పాదకతను పెంచే చర్యలు చేపడుతున్నాం.

* వారికి దిగుబడిని, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి.

* ధాన్యం పప్పు దినుసుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని రైతులు, దళితులు, గిరిజన వర్గాలకు ఈ బడ్జెట్ లాభదాయకమని చెప్పారు. అన్ని తరహా పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తీసుకున్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని, ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు.సాధారణ పౌరులకు, వ్యాపారవేత్తలకు సైతం ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని, ఈ బడ్జెట్‌తో జీవిత విధానం మరింత సరళంగా మారుతుందని పేర్కొన్నారు.

అన్ని రంగాలపై బడ్జెట్‌ను కేంద్రీకరించి ప్రకటించామని నరేంద్ర మోదీ తెలిపారు. సహకార వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.దేశంలో వ్యవసాయ ఉత్పాదక సంఘాల సేవలు విస్తృతం అవుతాయని తెలిపారు.దేశంలో రేపటితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని చెప్పారు.