//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ ట్వీట్ దేనికి అర్ధం..?

Category : national politics

ఒకవైపు కర్ణాటకలో రాజకీయం రణరంగంగా ఉన్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నరేంద్రమోదీ కాశ్మీర తీరాలకు బయల్దేరి వెళ్లారు. లేహ్, శ్రీనగర్, జమ్మూ సహా జమ్మూ కశ్మీర్‌లోని మూడు ప్రాంతాల్లో ఇవాళ ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను జమ్మూ కశ్మీర్‌లోని 3 ప్రాంతాల్లో పర్యటించనున్నాను. లేహ్‌ను సందర్శించిన తర్వాత, శ్రీనగర్ వెళ్లనున్నాను. తర్వాత జమ్మూలో పర్యటించనున్నాను...’’ అని పేర్కొన్నారు. దీనితో మోడీ ట్వీట్ అర్ధం బిజెపి బలపరీక్షలో నెగ్గుతుందనే విషయం స్పష్టంగా చెప్పినట్టు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.