అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. జూన్ చివరి వారంలో వాషింగ్టన్ లో వీరు సమావేశం కావచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని తొలిసారిగా ఆయనను కలువనున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రధాన ఎజెండాగా ఈ చర్చలు సాగనున్నాయి. భారత్‌ను కలవరపాటుకు గురిచేస్తున్న హెచ్1బీ వీసాల కోతపైనా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అణు సరఫరా దేశాల కూటమిలో భారత్ చేరిక ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాలు తూర్పు దక్షిణాసియాలో చైనా దూకుడు వ్యవహారం తదితర అంశాలు సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం.యితే విదేశాంగశాఖ ఉన్నతాధికారులు ఎవరూ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. అమెరికా అధికారులు మాత్రం భేటీ జరిగే అవకాశముందని సూచనప్రాయంగా తెలిపారు.