//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తొలి స్థానంలో నారాయణ!

Category : politics

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జెడ్ స్వీడుతో పనులు చక్కబెడుతుంటారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులని పరిగెత్తిస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆయన మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహిస్తుంటారు. వారికి ర్యాంకులు కేటాయిస్తుంటారు. పనితీరు బాగులేనివారికి వార్నింగులు, పనితీరు కనబర్చిన వారికి అభినందనలు లభిస్తుంటాయి.

తాజాగా మరోసారి మంత్రుల పనితీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ర్యాంకులను ప్రకటించారు. ఈ సారి తొలి స్థానంలో నారాయణ, రెండో స్థానంలో నారా లోకేష్ ఉన్నారు. మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు, ఇక చివరి రెండు స్థానాల్లో మంత్రులు ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్ ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు.