//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లోకేష్‌కి మరీ ఇంత టాలెంటా?

Category : editorial state politics

నారాలోకేష్ టాలెంట్ లోకానికి మరోసారి తెలిసొచ్చింది. ఎన్నాళ్లుగా పాలిటిక్స్ లో ఉన్నా..మిగిలినోళ్లకి తెలీంది మనోడికి మాత్రమే తెలిసింది చాలా ఉందని వాళ్ల తండ్రి గుర్తించాడు..వెంటనే ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశాడాయన..ఇప్పుడదే టాలెంట్‌తో జనానికి సాయపడేందుకు బయల్దేరాడు చినబాబు..అందులో భాగంగానే నిన్న అంబేద్కర్ 125వ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలకి హాజరయ్యాడు. అక్కడ చినబాబు స్పీచ్ ఇస్తూ..అంబేద్కర్ 126వ వర్ధంతి సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలంటూ తప్పులో కాలేశాడు. చుట్టూ ఉన్నోళ్లు గొల్లున నవ్వారు..మన హీరోగారి టాలెంట్ ఇంతకు ముందు కూడా హైదరాబాద్ రోడ్లపైనే ప్రదర్శించాడు. దేశంలో అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చి, ఆశ్రితపక్షపాతం ఉన్న పార్టీ టిడిపి కాకుండా వేరేది ఏదైనా ఉందా అంటూ తన మనసులో మాట బైటపెట్టేశాడు. జిహెచ్ఎంసి ఎన్నికల టైమ్ లో చేసిన ఈ కామెంట్ నోరు జారి చేశాడో..లేక తాను అనుకున్నదో చెప్పాడో కానీ..అప్పుడు జనానికి మాత్రం బాగా అర్ధమైంది..వెంటనే ఆ ఎన్నికల్లో టిడిపికి 1 కార్పొరేటర్ పదవిని దక్కించి ఝలక్ ఇచ్చారు..తాజాగా మళ్లీ తన విజ్ఞాన ప్రదర్శన ప్రారంభించడంతో ఫ్యాన్సంతా మావోడేంటి ఇలా చేస్తున్నాడంటూ తలపట్టుకుంటున్నారట. అదీ సంగతి

Related News