//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో సంచలనమైన వ్యాఖ్యలు చేసిన 'లోకేష్'

Category : state politics

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఏదొక సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఈసారి కూడా అలాంటి వ్యాఖ్య చేసి వార్తల్లో ఉన్నారు. 'జన్మభూమి - మా ఊరు' అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజల అభిమానం, ఆతిథ్యం చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లు అనిపిస్తుందని లోకేష్ అన్నారు.

ఈ నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, 16 గ్రామాలకు తాగునీరు అందించేందుకు కట్టమూరు గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీ విలేజ్ తాగునీటి పథకాన్ని రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే, పెద్దాపురంలో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే వ్యవసాయాధికారి కార్యాలయం, కట్టమూరులో రూ.4.93 కోట్ల వ్యయంతో నిర్మించే ఇంటింటికి కుళాయి పథకానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.