//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నారా లోకేష్ సంచలన ప్రకటన !

Category : state

జన్మభూమి కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు.

అనంతపురంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న ఆయన.. జిల్లాను దత్తత తీసుకుంటునట్లు ప్రకటించారు. జిల్లాతో తనకు ఉన్న మమకారం మరువలేనిదని లోకేష్ పేర్కొన్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఆరు నెలలు బస్సులో పడుకుని పరిపాలించాల్సిన పరిస్థితి నుంచి రాజధాని నిర్మాణం వరకు వచ్చామని అన్నారు.

గోదావరి, కృష్ణా నదులను కలిపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. దేశంలో అతి చిన్న వయసులోనే మంత్రిని అయ్యానని, నాన్న చినప్పుడే గ్రామాలకు సేవ చేయాలని చెప్పటంతో పంచాయతిరాజ్ శాఖను ఎంచుకున్నానని అన్నారు. దొంగ పేపర్, ఛానల్ నడుపుతున్న జగన్ కూడా పెద్ద గజదొంగేనని విమర్శించారు. ఎల్‌ఈడీ బల్పుల పంపిణీలో కుంభకోణం జరిగిందని రాశారని.. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు