//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబు పై జ‌గ‌న్ వ్యాఖ్య‌లు.. లోకేష్ మైండ్‌బ్లోయింగ్ రిప్లై..!

Category : politics

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేప‌ధ్యంలో తాజాగా ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్ పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సినిమా చూపిస్తున్నారని...వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు తీసిందని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో నత్తనడకన సాగుతున్నాయంటూ జగన్ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

దీంతో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల పై వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ధీటైన స‌మాధాంన ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఉపయోగించుకుంటూ వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని లోకేష్ మండిప‌డ్డారు. పోలవరం పనులను చంద్రబాబు చిత్తశుద్ధితో వేగంగా పూర్తి చేస్తుంటే సిగ్గు లేకుండా వైఎస్ హయాంలోనే పనులు వేగంగా జరిగాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నారని లోకేష్‌ తప్పుపట్టారు. వైఎస్ కల పోలవరం అంటూ ఆయన పేరును తెస్తున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే విజయానికి మాత్రం ఎంతో మంది తండ్రులని, అపజయం మాత్రం అనాధ అన్నది తనకు గుర్తుకు వ‌స్తోంద‌ని లోకేష్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే 55 శాతం పూర్తయిందని ఈ విష‌యాన్ని వైసీపీ శ్రేణులు తెలుసుకొని మాట్లాడితే మంచిద‌ని లోకేష్ చుర‌కలు అంటించారు.